Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటెం సాంగ్స్ ఇబ్బందిగా ఉంటుంది... కానీ దాన్ని ఒప్పుకుంటా... రాశీఖన్నా

చాలామంది కథానాయికలు సినిమాల్లో ఐటంసాంగ్‌ చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ తనకు అది సూటూకాదని నటి రాశీఖన్నా తెలియజేస్తుంది. తాజాగా రవితేజ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయనీ.. మరో రెండు తమిళ చిత్రాల్లో నటించనున్నట్లు చెబుతోంది. షూటింగ్‌ విషయాలన

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (18:41 IST)
చాలామంది కథానాయికలు సినిమాల్లో ఐటంసాంగ్‌ చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ తనకు అది సూటూకాదని నటి రాశీఖన్నా తెలియజేస్తుంది. తాజాగా రవితేజ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయనీ.. మరో రెండు తమిళ చిత్రాల్లో నటించనున్నట్లు చెబుతోంది. షూటింగ్‌ విషయాలను చెబుతూ.. సెట్‌లో ఉంటే అందరినీ నవ్విస్తుంటాను. ఇటీవలే ఓ పాత్ర కోసం బరువు తగ్గాను. అలా తగ్గడానికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణం అనొచ్చు. అలాగే బాలీవుడ్‌లోకి ఎంటర్‌ కావాలని ప్రయత్నాలు చేయడం లేదు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. 
 
ఏదో సక్సెస్‌ సాధించేయాలనో, ఎక్కువ సినిమాలు చేసేయాలనో టెన్షన్‌ పడను. తెలుగులో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే. అలాగే పీరియాడిక్‌ ఫిలింలో కూడా నటించాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలియజేసింది. డబ్బింగ్‌ గురించి చెబుతూ... నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉంది కానీ అంత సమయం ఉండటం లేదు. ఇక ఇప్పుడు చాలామంది హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఐటెం సాంగ్స్‌ చేయడానికి నేను అంత కంఫర్ట్‌గా ఫీల్‌కాను. ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. 
 
ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చూస్తే... నేను ఖాళీ సమయాల్లో క్రికెట్‌ ఆడతాను, బుక్స్‌ చదువుతుంటాను. సోషల్‌ యాక్టివిటీస్‌ కూడా చేస్తాను. అయితే వాటి గురించిన వివరాలు ఇప్పుడు చెప్పదలుచుకోవడం లేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రవితేజగారితో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments