Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకు దూసుకుపోతున్న రంగస్థలం మహేష్

Webdunia
శనివారం, 6 మే 2023 (16:13 IST)
Rangasthalam Mahesh
బుల్లితెరపై కమెడియన్‌గా కనిపించిన మహేష్‌.. సిల్వర్‌ స్క్రీన్ మీద నటుడిగా తన సత్తా చాటుకున్నారు. కామెడీతో నవ్వించడమే కాదు.. ఎమోషనల్‌ సీన్స్‌లో నటించి ఏడిపించగలరు. ఇక విలనిజాన్ని కూడా ప్రదర్శించగలరు. అలా విభిన్న పాత్రలతో ఆడియెన్స్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేష్‌ కెరీర్‌ను రంగస్థలం ఒక్కసారిగా మార్చేసింది. ఇక ఆ రంగస్థలం సినిమానే తన ఇంటి పేరు అన్నంతగా మారిపోయింది. ఆ చిత్రం తరువాత మహేష్‌ కాస్తా.. రంగస్థలం మహేష్ అన్నట్టుగా మారిపోయింది.
 
రంగస్థలం మహేష్‌ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియన్ హీరోలతో, పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నారు. మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో మహేష్‌ నటిస్తున్నారు. ఇక మారుతి ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ మహేష్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. 
 
కళ్యాణ్‌ రామ్ డెవిల్ ప్రాజెక్టులోనూ మహేష్‌ కనిపించనున్నారు. ఇలా టాలీవుడ్‌లోని క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు దక్కించుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కమెడియన్, ఆర్టిస్టుగా అన్ని రకాలుగా కారెక్టర్లు వేస్తూ విలక్షణంగా నటిస్తూ దూసుకుపోతోన్నారు రంగస్థలం మహేష్. మున్ముందు మహేష్‌ పేరు మరింతగా వినిపించేలా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేదరిక నిర్మూలన.. కుప్పం నుంచే మొదలు.. సీఎం చంద్రబాబు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments