Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్కుతో డార్లింగ్ సినిమా.. అబుదాబికి ''సాహో'' ఎందుకు?

రంగస్థలం సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో.. డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. సుకుమార్ మెగా హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని ప్రచారం

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (13:59 IST)
రంగస్థలం సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో.. డార్లింగ్, బాహుబలి హీరో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. సుకుమార్ మెగా హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని సుకుమార్ చెప్తున్నాడు. కథను బట్టి హీరోను ఎంపిక చేసుకుంటానని సుకుమార్ చెప్పుకొచ్చారు. 
 
అయితే సుకుమార్ తన తదుపరి సినిమా ప్రభాస్‌తో చేయవచ్చునని టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ .. ప్రభాస్‌తో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పడం ఈ ప్రచారానికి బలం ఇస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌తో సుకుమార్ చర్చలు కూడా జరిపేశారని.. సుకుమార్‌తో సినిమా చేసేందుకు డార్లింగ్ కూడా సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగనుంది. ఈ నెల పదో తేదీ నుంచి అబుదాబిలోని వివిధ ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
 
బుర్జ్ ఖలీఫాతో పాటు మరికొన్ని కీలక లొకేషన్స్‌లో 40 రోజుల పాటు ఈ షూటింగ్ జరుగనుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ''కెన్నీ బేట్స్" ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments