Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలో తర్వాత రంగబలి నాకు మరో బ్లాక్ బస్టర్: హీరో నాగశౌర్య

Webdunia
శనివారం, 8 జులై 2023 (17:24 IST)
Nagashaurya, Pawan Basamshetty, Yukti Tareja
హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన  ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించారు. జూలై 7న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ‘భలే’ ఎంటర్ టైనర్ గా నిలిచి బ్లాక్ బ్లాక్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
 
సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. రంగబలి చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. పవన్ చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి కథ చెప్పారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. 'ఛలో' తర్వాత నాకు రంగబలి మరో బ్లాక్ బస్టర్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నిర్మాత సుధాకర్ గారికి. టీం అందరికీ కృతజ్ఞతలు. యుక్తి చక్కగా నటించింది. చాలా మందికి నచ్చింది. సత్య, జాకెట్ (రాజ్ కుమార్ ) ఇద్దరూ చక్కగా ఎంటర్ టైన్ చేశారు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు
 
దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ..రంగబలి చిత్రాన్ని ప్రేక్షకులు అన్ని చోట్ల ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పడిపడి నవ్వుతున్నారు. ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శౌర్య అన్న, సత్య, రాజ్ కుమార్ పాత్రలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక మంచి కథ, సందేశాన్ని చెప్పాం. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. నాగశౌర్య అన్నకి, నిర్మాత సుధాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' తెలిపారు.
 
యుక్తి తరేజ మాట్లాడుతూ..ఇది నా మొదటి తెలుగు సినిమా. సినిమాని ప్రేక్షకులు   ఎంతగానో ఆదరిస్తున్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి''అన్నారు
 
రాజ్ కుమార్ మాట్లాడుతూ.. రంగబలి అందరికీ నచ్చింది. సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడనివారు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇది ఒక ఊరు ఎమోషన్. అందరికీ కనెక్ట్ అవుతుంది'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

కడుపు నొప్పితో బాధపడిన మహిళ... పొట్టలో ఏకంగా రెండు కేజీల తలవెంట్రుకలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments