Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న 'రంగ్ దే' ప్రచార సంబరాలు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:33 IST)
Nitin, keerty suresh
నితిన్‌, 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం ఈ 'రంగ్ దే'. 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి  సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి  2021 మార్చి 26న ధియేటర్ లలో ' రంగ్ దే' సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు 'వెంకీ అట్లూరి'.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. 'ప్రేమ'తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ  'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 
 
ఇంకా నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్) పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్‌, స‌మర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments