Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మన్మథ' బాణానికి పడిపోయిన బలశాలి 'భల్లాలదేవుడు'

Webdunia
బుధవారం, 13 మే 2020 (08:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో మోస్ట్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా అలియాస్ 'భల్లాలదేవ' కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమిస్తూ వచ్చిన ఓ అమ్మాయి ఇంతకాలానికి రానాకు ఓకే చెప్పేసింది. దీంతో రానా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం రాత్రే పంచుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ రానా ప్రియురాలి పేరు మిహీకా బజాజ్. వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. 
 
ఈ వార్త చదివిన మెగాస్టార్ చిరంజీవి క్షణాల్లో స్పందించారు. 'కంగ్రాచ్యులేషన్స్ మై బోయ్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. 'చివరికి భల్లాలదేవుడి అంతటి బలశాలి కూడా మన్మథుడి ప్రభావానికి చిక్కుకున్నాడు. ఈ లాక్డౌన్ మీ పెళ్లికి దారితీసింది. మీ ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను, శతమానం భవతి' అంటూ ట్వీట్ చేశారు.
 
మెగాస్టార్ చిరంజీవి 'శతమానం భవతి' అంటూ దీవించడంపై మిహీక బజాజ్ వెంటనే ట్వీట్ చేసింది. 'థాంక్యూ చిరంజీవి సర్' అంటూ వినమ్రంగా స్పందించింది. కాగా, రానా శుభవార్త చెప్పడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్, నితిన్, నిధి అగర్వాల్, నీల్ నితిన్ ముఖేశ్, కుబ్రా సైత్, దేవిశ్రీప్రసాద్, కాజల్ అగర్వాల్, సాయితేజ్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments