Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రానా నాయుడు'గా బాబాయ్ - అబ్బాయ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (11:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో బాబాయ్ - అబ్బాయ్‌గా ఉన్న దగ్గుబాటి వెంకటేష్ - రానా దగ్గుబాటిలు తొలిసారి కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ఇది నిజంగానే దగ్గుబాటి ఫ్యాన్స్‌కు శుభవార్త. ఈ శుభవార్తను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. వెంకీ, రానాలతో ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. 
 
అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనొవాన్ మాత‌ృకకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్‌‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మలు డైరెక్ట్ చేయనున్నారు. 
 
ఇప్పటివరకు తమ కెరీర్లలో చేయనటువంటి పాత్రల్లో నటించబోతున్నట్లు ఈ సిరీస్‌ గురించి రానా తెలిపారు. ఇది తమకు ఛాలెంజింగ్ అని, షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. రానాతో పని చేయడానికి తాను కూడా వెయిట్ చేస్తున్నానని.. రే డొనొవాన్ సిరీస్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని వెంకీ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments