హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది.
అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
-మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న ఫస్ట్ మూవీ మహావతార్ నరసింహ. శ్రీమహావిష్ణువు దశావతారాలన్నీ లార్జర్ దెన్ లైఫ్, బిగ్ కాన్వాస్ లో ప్రజెంట్ చేయాలని ఆలోచనతో మహావతార్ యూనివర్స్ మొదలైంది.
- యానిమేషన్ లోనే ఈ సినిమాని నిర్మించాలని ఆలోచన మొదటి నుంచి ఉంది. శ్రీమహావిష్ణువు కథని చెప్పాలంటే యానిమేషన్ అనేది ఒక బెస్ట్ మీడియం. కొన్ని సార్లు నటులు దేవుని పాత్రలు చేసేటప్పుడు చాలా చాలెంజింగ్ గా ఉంటుంది. అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.
-ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి చాలా అవసరం. నరసింహ స్వామి రక్షకుడు. ప్రజెంట్ సిచువేషన్ కి నరసింహ స్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజ ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాము.
- ఇది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర. ప్రతి జనరేషన్ కి మన చరిత్రని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ జనరేషన్ యువతకి మన చరిత్ర తెలియజేయాలి.
-ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము అహోబిలం వెళ్ళాము. స్వామివారి ఆశీర్వాదము ఈ సినిమాపై ఉంది. ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాము.
- హిరణ్య కశ్యప పాత్ర కోసం రానా లేదా విజయ్ సేతుపతి. నరసింహ పాత్ర మాత్రం యానిమేట్ చేయాల్సిందే.
-శ్యామ్ సియస్ అద్భుతమైన మ్యూజిక్ ని కంపోజ్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఆర్కెస్ట్రా కంపోజ్ చేశారు. చాలా అద్భుతమైన మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. పవర్ఫుల్ డివైన్ ఫుల్ మ్యూజిక్ ని క్రియేట్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
-ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది. పైసా వసూల్ మూవీ. అలాగే ఒక చరిత్ర, సాంస్కృతి, ధర్మాన్ని కూడా అద్భుతంగా చూపించే సినిమా ఇది.