Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

Advertiesment
Mahavatar Narasimha poster

దేవీ

, బుధవారం, 9 జులై 2025 (19:16 IST)
Mahavatar Narasimha poster
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ అత్యద్భుతంగా వుంది.
 
 హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది.
 
ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ ట్రైలర్ విజువల్ వండర్ లా వుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. భారతీయ చరిత్ర నుండి ఈ ఐకానిక్ కథను ఇంత అద్భుతంగా చూపడం ఇంతకు చూడలేదు.
 
నిర్మాత శిల్పా ధావన్  మాట్లాడుతూ.. శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది" అన్నారు
 
దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. మహావతార్ సినిమాటిక్  యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్  ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది.  క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా,  స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే కల సజీవంగా ఉంది'అన్నారు
 
హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ కోసం లైనప్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది. విష్ణువు దశ అవతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.
 
మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పించిన శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు, ఈ డైనమిక్ భాగస్వామ్యం సినిమాటిక్ అద్భుతాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం 3Dలో ఐదు భారతీయ భాషలలో 2025 జూలై 25న విడుదలవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ