Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ప్రాజెక్టులో ర‌మ్య‌కృష్ణ‌...

ర‌మ్య‌కృష్ణ ఒక‌ప్పుడు అగ్ర‌హీరోల‌తో న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తార‌. కొన్నాళ్లు సినిమాలు త‌గ్గించి బుల్లితెర పైన ప్ర‌త్య‌క్ష‌మైన ర‌మ్య‌కృష్ణ ఇటీవ‌ల బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి..మ‌రోసారి త‌న‌కు తానే సాటి అని నిరూపించార

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:58 IST)
ర‌మ్య‌కృష్ణ ఒక‌ప్పుడు అగ్ర‌హీరోల‌తో న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తార‌. కొన్నాళ్లు సినిమాలు త‌గ్గించి బుల్లితెర పైన ప్ర‌త్య‌క్ష‌మైన ర‌మ్య‌కృష్ణ ఇటీవ‌ల బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి..మ‌రోసారి త‌న‌కు తానే సాటి అని నిరూపించారు. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో న‌టించారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... ర‌మ్య‌కృష్ణ మెగా ప్రాజెక్టులో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. 
 
ఇంత‌కీ ఆ మెగా ప్రాజెక్ట్ ఏమిటంటారా..? అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో స‌క్స‌స్ సాధించిన యువ దర్శకుడు సాగర్ చంద్ర. వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించార‌ట‌. ఆమెకు ఆ పాత్ర న‌చ్చ‌డంతో  ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ సినిమాలోను రమ్యకృష్ణ పాత్ర ఆమె ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments