Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు.. హీరో సూర్యకు నాకు ఎలాంటి లింకు లేదు.. రమ్యకృష్ణ

తమిళ హీరో సూర్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటి రమ్యకృష్ణ అంటోంది. నిజానికి రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఉన్నప్పటి కంటే.. సీనియర్ నటిగానే ఆమె బిజీ అయిపోయింది.

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (14:31 IST)
తమిళ హీరో సూర్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటి రమ్యకృష్ణ అంటోంది. నిజానికి రమ్యకృష్ణ హీరోయిన్‌గా ఉన్నప్పటి కంటే.. సీనియర్ నటిగానే ఆమె బిజీ అయిపోయింది. దీనికి కారణం 'బాహుబలి' చిత్రమే. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర అలాంటిది. ఈ చిత్రం తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
'బాహుబలి'లో శివగామిగా గుర్తిండిపోయే పాత్ర చేసి మెప్పించి.. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పటికే 'శభాష్ నాయుడు'లో కమల్ హాసన్‌కి జంటగా నటిస్తోంది. దీంతో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య చేస్తోన్న చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది.
 
ఈ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను ఆమె చెప్పుకొచ్చింది. సూర్య చిత్రంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తన పాత్రని చాలా బాగా డిజైన్ చేశాడు. సినిమాలో కీలక పాత్ర అది. కాకపోతే సూర్యతో కలసి ఒక్క సీన్‌లో కూడా ఆమె కనిపించదట. సినిమాలో సూర్యతో సంబంధమే లేదని చెప్పుకొచ్చింది.
 
కీలక పాత్ర, హీరోతో ఒక్క సీన్ కూడా లేకుండా ఎలా డిజైన్ చేశాడన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలంటోంది రమ్య కృష్ణ. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. ఇందులో వీలైతే నయనతారతో అతిథి పాత్రని ప్లాన్ చేయడానికి దర్శకుడు ట్రై చేస్తున్నాడట. ఇక, సూర్య నటించిన 'సింగం-3' ఈనెల 23వ తేదీన క్రిస్మస్ గిఫ్ట్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments