Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాములో రాములా పాట అరుదైన రికార్డ్... 100 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:04 IST)
'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
 
ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములో, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. రిలీజ్‌కు ముందే రాములో రాములో యూట్యూబ్‌లో లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. 
 
విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో పాటలు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 362 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ సినిమాలోని 'సామజవరగమన' ఫుల్ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇక 'అల వైకుంఠపురములో' సినిమాలోని రాములో రాములో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో తాజాగా 200 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక రాములో రాములో లిరికల్ వీడియో సాంగ్ 300 వ్యూస్ రాబట్టింది. మొత్తంగా 'అల వైకుంఠపురములో' మ్యూజిక్ ఆల్బమ్‌లోని రాములో రాముల పాట మొత్తంగా 500 మిలియన్ వ్యూస్‌ను సంపాదించింది. తెలుగులో ఓ పాట ఈ రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకోవడం పెద్ద విశేషమేనని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments