Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్టింగ్ స్కూల్ నెల‌కొల్ప‌నున్న‌ రామోజీరావు

Webdunia
గురువారం, 26 మే 2022 (18:24 IST)
Ramojirao-Rajamouli
తెలుగు రాష్ట్రాల‌లోకాదు దేశంలో పేరున్న వ్య‌క్తి రామోజీరావు. ఫిలింసిటీను ఏర్పాటు చేసి దేశంలోని అన్ని భాష‌ల చిత్రాల‌కు షూటింగ్ ప్లేస్‌గా చేసిన ఆయ‌న ఇప్పుడు తాజాగా యాక్టింగ్ స్కూల్‌పై  కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేస్తున్నారు. ఈటీవీలో ఎన్నో సీరియ‌ల్స్ ప్ర‌సారం అవుతున్నాయ‌నీ, సాంకేతిక సిబ్బంది ప‌నిచేస్తున్నారు. ప‌ర బాషా న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బందికూడా వెలుగులోకి వ‌స్తున్నారు. అయితే ఎక్కువ‌గా టీవీలో ప‌రబాషా న‌టీన‌టులు క‌నిపించ‌డంతో ఆంధ్ర‌, తెలంగాణకు చెందిన ఔత్సాహికులను ప్ర‌వేశం కొర‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే ప్ర‌స్తుతం వున్న ఫిలింస్కూల్‌కు ఛాలెంజ్‌గా మారిన‌ట్లే.
 
ఈ స్కూల్ విష‌య‌మై  తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల తాను రామోజీ గ్రూపు సంస్తల అధినేత రామోజీ రావు గారిని కక‌లిశాను.  సుమారు అరగంట సమయం నాతో గ‌డిపారు.  కొత్తవాళ్లకు నటన , సాంకేతిక రంగంలో శిక్షణ ఇవ్వడానికి రామోజీ రావు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున కూడా కొంతందని విద్యార్థులను శిక్షణ కోసం పంపాలని రామోజీగారు చెప్పారని ప్రతాని రామకృష్ణ గౌడ్  తెలిపారు. అంద‌రూ రామోజిగారిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. త్వ‌ర‌లో దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments