Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లోని కొండాపూర్‌‌లో నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకాష్‌-బైజూస్‌

Advertiesment
image
, గురువారం, 26 మే 2022 (18:04 IST)
దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనే కలను సాకారం చేయాలనే తమ లక్ష్యానికనుగుణంగా, దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌-బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని కొండాపూర్‌ వద్ద ప్రారంభించింది. ఈ నూతన కేంద్రంలో 11 తరగతి గదులు ఉంటాయి. ఇవి 1000 మంది విద్యార్థులకు తగిన సౌకార్యలను అందించగలవు. హైదరాబాద్‌ నగరంలో ఆకాష్‌-బైజూస్‌కు ఇది ఏడవ కేంద్రం.

 
ఆకాష్‌-బైజూస్‌ కేంద్రం, మొదటి అంతస్తు, శ్రీ మైత్రి స్క్వేర్‌ గచ్చిబౌలి మియాపూర్‌ రోడ్‌, కొత్తగూడా, శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ ఎదురుగా, హైదరాబాద్‌ వద్ద ఉంది. ఈ క్లాస్‌రూమ్‌ కేంద్రం, వైద్య మరియు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల అవసరాలతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సుల అవసరాలను సైతం తీర్చనుంది. విభిన్నమైన పోటీపరీక్షలు అయినటువంటి ఒలింపియాడ్స్‌ మొదలైన వాటిలో పాల్గొనే వారికి సహాయపడే కోర్సులను అందించడంతో పాటుగా తమ బేసిక్స్‌ను సైతం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది.

 
క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ఆకాష్‌-బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా, కంపెనీ ఉన్నతాధికారుల సమక్షంలో ప్రారంభించారు. నూతన కేంద్రం ప్రారంభం గురించి  ఆకాష్‌-బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘ కొండాపూర్‌లోని క్లాస్‌రూమ్‌ కేంద్రం, ఒలింపియాడ్‌లో సత్తా చాటాలనుకునే విద్యార్థులతో పాటుగా డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనుకునే స్థానిక విద్యార్ధులకు ఓ వరంగా ఇది నిలుస్తుంది. నేడు, దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యను తమ దేశవ్యాప్త నెట్‌వర్క్‌ కేంద్రాల ద్వారా అందించడం ద్వారా ఆకాష్‌-బైజూస్‌ సుప్రసిద్ధమైంది. మా విద్యా కంటెంట్‌ నాణ్యత మరియు మా బోధనా పద్ధతుల ప్రభావం కారణంగా అత్యధిక సంఖ్యలో ఆకాష్‌-బైజూస్‌ విద్యార్థులు పలు పోటీ పరీక్షలలో ఎంపికయ్యారు. ఇవే అంశాలు అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులలో చేరగోరు విద్యార్ధులకు  అత్యున్నత ప్రాధాన్యతా ఇనిస్టిట్యూట్‌గా ఆకాష్‌+బైజూస్‌ను నిలిపాయి’’ అని అన్నారు.

 
మిశ్రా మరింతగా మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ వద్ద మా నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము.  దీనిద్వారా హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణాలో మా కార్యకలాపాలను మరింతగా విస్తరించాము. మా జాతీయ నెట్‌వర్క్‌కు  ఈ శాఖను జోడించడమనేది ప్రామాణీకరణ నాణ్యమైన బోధన,  ఆధునిక మౌలిక వసతులను మరియు సాంకేతిక ఆధారిత వ్యవస్ధలను వినియోగించి భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులకు అభ్యాస వాతావరణం సృష్టించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు