రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ట్రెండ్ కావాలని చూస్తుంటాడు. ఆయన టైం కూడా అలాగే వుంటుంది. తాజాగా ఆయన తెలంగాణాలో దేవతగా పూజించే సమ్మక్కకు మెగ్ డోల్డ్ విస్కీ ఆఫర్ చేశాడు. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడుతుండగా ఫొటో తీసి పోస్ట్ చేశాడు. ఆయన తాజాగా `కొండా` అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మా కొండా మూవీని విడుదలచేసి సక్సెస్ చేయాలని దేవతను కోరుకున్నారు.
కొండా మురళీ, సురేఖ సమక్షంలో వారి ఇంటిలోనే ఈ దృశ్యం చోటుచేసుకుంది. ఇలా ఆఫర్ చేస్తుండగా నిర్మాత బేబీ శ్రేష్ట ఫొటోతీసింది. కాగా, కొండా సినిమాను గత నెలలో విడుదలచేయాలనుకున్నారు. కానీ కరోనా మూడవ వేవ్ వల్ల వాయిదా పడింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే థియేటర్ల సమస్య గుర్తుకు వచ్చి పేర్నినాని వంటివారిని కలిసి ఆమధ్య హడావుడి చేశాడు. కానీ ఏం ప్రయోజనం కనిపంచలేదు. ఆ తర్వాత పరిణామాలు తెలిసిందే. చిరంజీవితోపాటు పలువురు హీరోలు వెళ్ళి జగన్‌ను కలిసి సమస్యను పరిష్కార దిశగా చూశారు.