నేడు ఉదయం రాజమండ్రి వెళ్ళి అక్కడ పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ కొణిదెల, రామ్ చరణ్ లు అనంతరం పవన్ ఇంటికి వెళ్లి కలిసారు. వీరి రాకకోసం పిఠాపురం మొత్తం జనసంద్రమైంది. పవన్ కళ్యాన్, చరణ్, అల్లు అరవింద్, సురేఖ గారు ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆశీస్సులు అందించారు.
pavan house pitapuram
మాత్రుసమానులైన వదినగారైన సురేఖ గారి ఆశీస్సులు పవన్ కు లభించాయి. ఈ సందర్భంగా చెప్పలేనంత ఆనందంతోపాటు ఆ దేవుని ఆశీస్సులు లభించాయిని పవన్ తెలిపినట్లు సమాచారం. ఇక అక్కడ అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ ను పదేపదే ఆహాకారాలతో సందడి చేశారు. తాజాగా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ లో కూడా దాదాపు ఇంత మంది జనాల మధ్య ఓ సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.