Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంకిత ఠాకూర్‌ కు ఓటింగ్ ద్వారా స‌పోర్ట్ చేయాలని రామ‌కృష్ణ‌గౌడ్ విజ్ఞ‌ప్తి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:16 IST)
Ramakrishna Goud, Ankita Thakur, Rashmi Thakur
పెగాసిస్ వారు నిర్వ‌హిస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్ కు సెల‌క్ట్ అయ్యారు  సినీన‌టి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేర‌ళలోని కొచ్చిలో ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా  తెలంగాణ నుంచి `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ కు సెల‌క్ట్ అయిన అంకిత ఠాకూర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో `మిస్ ఏసియా` ర‌ష్మి ఠాకూర్‌, తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
 ఈ సంద‌ర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ...``తెలంగాణ కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్  ఫైన‌ల్స్ కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఓటింగ్ ద్వారా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల 11న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్`  ఫైన‌ల్స్ జ‌రగ‌నున్నాయి` అన్నారు.
 
 `మిస్ ఏసియా`, తెలంగాణ మా అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌ష్మీ ఠాకూర్ మాట్లాడుతూ...``పెగాసిస్ వారు కండ‌క్ట్ చేస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్ కు చేరుకున్న అంకిత ఠాకూర్ నాకు క‌జిన్ అవుతారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు నేను ట్రైనీగా ఉన్నాను. క‌చ్చితంగా త‌ను `మిస్ ఇండియా గ్లోబ‌ల్` క్రౌన్ గెలుచుకుని వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.  మ‌న తెలంగాణను  రిప్ర‌జెంట్ చేస్తోన్న అంకిత ఠాకూర్ కి ఓటింగ్ ద్వారా తెలంగాణతో పాటు తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
 తెలంగాణ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ...``తెలంగాణ నుంచి `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ `ఫైన‌ల్స్ కు చేరుకున్న అంకిత ఠాకూర్ కి ముందుగా శుభాకాంక్ష‌లు. ఈ నెల 11న కొచ్చిలో ఫైన‌ల్స్ జ‌రుగనున్నాయి. క‌చ్చితంగా అంకిత ఠాకూర్ `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` గెలుచుకుని వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు, తెలుగు వారంద‌రూ కూడా ఆమెకు ఓట్లు వేసి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరుకుంటున్నా. గ‌తంలో మిస్ ఏసియా టైటిల్ గెలుచుకున్న ర‌ష్మీ ఠాకూర్ కి కూడా మా తెలంగాణ ఫిలించాబ‌ర్ ఎంతో స‌పోర్ట్ చేసింది. ఇప్పుడు అంకిత ఠాకూర్ కి కూడా మా ఫుల్ స‌పోర్ట్ ఉంటుంది.  ప్ర‌జంట్  ర‌ష్మీ ఠాకూర్,  అంకిత ఠాకూర్ లు హీరోయిన్లుగా రెండు చిత్రాలు నిర్మిస్తున్నా`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments