Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ కందుకూరి ఆవిష్క‌రించిన రామచంద్రపురం టీజర్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:06 IST)
Ramachandrapuram team
నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తారగణంలో ఆర్.నరేంద్రనాథ్ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం `రామచంద్రపురం`. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరులో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రంలోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు  విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ "టీజర్ చాలా బాగుంది. వైవిధ్యభరితంగా ఉంది. యానిమేషన్ రూపంలో టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి విజయవంతం కావాలి" అని కోరుకున్నారు
 
దర్శకుడు ఆర్. నరేంద్రనాథ్ మాట్లాడుతూ, అద్భుతమైన క్వాలిటీ లో సినిమా రెడీ అవుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన యాక్షన్ డ్రామా చిత్రం. మేము చిత్రం మొత్తం రామచంద్రపురం అనే ఊరిలో నిజమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. రెండు పాటలు విడుదల చేసాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు టీజర్ విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాం. మా సినిమా ని త్వరలోనే విడుదల చేస్తాము" అని తెలిపారు.
 
హీరో హీరోయిన్లు మాట్లాడుతూ "రామచంద్రపురం పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక యాక్షన్ డ్రామా చిత్రం. సినిమాలో పనిచేస్తున్న నటి నటులు టెక్నికాన్స్ అందరు 25 వయసు వాళ్లే. సినిమా యూత్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రెండు పాటలు విడుదల అయ్యాయి, చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు టీజర్ విడుదల అయ్యింది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments