Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

దేవీ
గురువారం, 21 ఆగస్టు 2025 (16:59 IST)
Nuvvunte chale.. antunna Ram potineni
ప్రియుడు తన ప్రేయసినుద్దేశించి నువ్వుంటే చాలే..అంటూ సంబోదిస్తూ ఆనందంలో ఓలలాడే పాటను ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంలో పొందుపరిచారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన 'నువ్వుంటే చాలే' పాటను అనిరుధ్ రవిచందర్ పాడగా, రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరిక్స్ వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది. ఇది తన స్వీయానుభవంతో రాశారా అన్నట్లుగా వుందని నెటిజన్లు కామెంట్లు కితాబిస్తున్నారు.
 
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మహేష్ బాబు పి' దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ , బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో స్ట్రాంగ్ బజ్‌ క్రియేట్ చేసింది. రామ్‌ను డై-హార్డ్ సినిమా బఫ్‌గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది. 
 
ఇప్పుడు, మేకర్స్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'ఆంధ్రా కింగ్ తాలూకా' నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది సినిమా విడుదలకు సరైన డేట్. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ స్టైలిష్ ఎనర్జిటిక్ అవాతర్ లో కనిపించి థియేటర్లలో ఫెస్టివల్ వైబ్ ని సెట్ చేశారు.
 
ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రముఖ సినీ సూపర్ స్టార్ పాత్రను పోషించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ,  VTV గణేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
 
సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో, ఈ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రమోషన్స్ ని ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
 
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments