Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

దేవీ
మంగళవారం, 15 జులై 2025 (11:40 IST)
Ram Pothineni
రామ్ పోతినేని మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అతను సినిమా అభిమానిగా అలరించనున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది.
 
ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. వివేక్ - మెర్విన్ ద్వయం స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని అలరించనున్నారు. ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న విడుదల అవుతుంది. ట్రాక్ కోసం ప్రమోషనల్ పోస్టర్‌లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు పడవపై ప్రయాణిస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది.
 
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని,  శ్రీకర్ ప్రసాద్‌ ఎడిటింగ్, అవినాష్ కొల్లా పొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
 
చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో పాటు మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభం కానుండటంతో మేకర్స్ సినిమాకి వున్న సెలబ్రేషన్ మూడ్‌కి తగ్గట్టు ఫుల్ జోష్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కి రెడీ అవుతున్నారు.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments