Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం కీలకమైన షెడ్యూల్

Advertiesment
Ram Pothineni's Andhra King Taluka

దేవీ

, శుక్రవారం, 11 జులై 2025 (17:46 IST)
Ram Pothineni's Andhra King Taluka
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
 
నెల రోజుల కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన సెట్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం, రామ్, భాగ్యశ్రీ బోర్సే  పై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీం20 రోజులు డే టైంకి షూటింగ్‌ షిఫ్ట్ అవుతుంది. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
 
ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలని పెంచింది.
 
టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చ్దేస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.  
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటమనిషి గన్ పడితే.. కథతో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ ల సార్‌ మేడమ్‌