Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్ కంటే లోకేష్ బాగా నచ్చాడంటున్న వర్మ... సంగతేంటో తెలుసా

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (13:18 IST)
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో చంద్రబాబు, తెలుగుదేశం జనాలతో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నాడు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు కూడా గట్టిగానే వర్మపై విరుచుకుపడుతున్నారు. 
 
వర్మ నిన్న తన ట్విట్టర్ అకౌంట్‌లో తెల్ల చొక్కా, పైకెత్తి కట్టుకున్న తెల్ల పంచె ధరించి, చేతిలో కత్తి పట్టుకుని నిల్చున్న ఉన్న వ్యక్తి బాడీకి తన ముఖాన్ని తగిలించి, "లక్ష్మీస్ ఎన్‌టీఆర్‌కు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్ అని, ఎన్‌టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదు ఆయన అసలు నాయకుడు అని, నేను ముదురు నాయకుడిని అని ట్వీట్ చేసాడు. ఆ వెంటనే మరో ట్వీట్‌లో సారీ అక్షర దోషం జరిగింది నేను ముదురు నాయకుడిని కాదు ముదురు నా కొడుకును" అని పోస్ట్ చేసాడు.
 
దీని వెంటనే మరో ట్వీట్‌లో అదే ఫోటోకు నారా లోకేష్ ముఖాన్ని తగిలించి "ఈ అద్భుతమైన వ్యక్తిని చూసి నేను భయపడ్డాను. ఇతనెవరో నాకు తెలీదు కానీ దావూద్ ఇబ్రహీం, ఒసామా బిన్ లాడెన్ మరియు పరిటాల రవి కన్నా తీవ్రంగా ఉన్నాడు. ఇతనెవరో ఎవరైనా చెప్తారా అంటూ ట్వీటేసాడు. అరవిందసమేత సినిమాలో తారక్ బదులు ఈ వ్యక్తి ఉంటే కలెక్షన్లు మూడురెట్లు ఎక్కువవుతాయి" అని చెప్పాడు.
 
చివరి ట్వీట్‌లో "ఇతను రాజకీయాల్లో ఉన్నట్లు నాకెవరో చెప్పారు, అయితే అతను సినిమాల్లో ఉండాల్సిన వాడు, నేను అతని డైలాగ్ డెలివరీ విన్నాను అద్భుతంగా ఉంది తారక్‌తో పోల్చితే అతని ఉచ్ఛారణ అమోఘం. ఇతను ఫిల్మ్ స్టార్ కావడానికి బదులుగా రాజకీయాల్లో ఉండి ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు?" అంటూ లోకేష్‌ను ఓ ఆట ఆడుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments