Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వర్మ'పై బయోపిక్ : పైశాచికం - విచ్చలవిడితనమే కథాంశంగా...

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (13:32 IST)
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఉన్న వివాదాస్పద దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటివరకు పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోపిక్‌లు నిర్మించారు. వాటిలో కొన్ని హిట్ కాగా, మరికొన్ని ఫట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత జొన్నవిత్తుల దర్శకుడు వర్మకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
రాంగోపాల్ వర్మ పైశాచికం, ఆయ‌న విచ్చ‌ల‌విడిత‌నం అనే అంశాలను నేపథ్యంగా తీసుకుని ఓ సినిమా తీయనున్నట్టు చెప్పారు. అన్న‌ట్టుగానే వ‌ర్మ బ‌యోపిక్ సినిమాకి సంబంధించి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.
 
వ‌ర్మ తెర‌కెక్కించిన 'అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు' సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆర్జీవీ కొన్ని విష‌యాల‌పై తీవ్రంగా స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల మండిప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య అనేక వాగ్వాదాలు చోటుచేసుకోగా, ఆర్జీవి.. జొన్న‌విత్తుల‌ని జొన్నపొత్తు అని కామెంట్ చేయ‌డం, జొన్నవిత్తుల‌.. వ‌ర్మ‌ని పప్పు వ‌ర్మ అని కామెంట్ చేయ‌డంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
 
ఈ నేపథ్యంలో వర్మ తనపై చేసిన కామెంట్స్‌కు ఒళ్లు మండిన జొన్నవిత్తుల వ‌ర్మ‌పై బ‌యోపిక్ త‌ప్ప‌క చేస్తాన‌ని, దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ప్రకటించారు. ఆయన అన్న‌ట్టుగానే ఇప్పటికే ఆ సినిమా ప‌నులు ప్రారంభించార‌ు. 
 
వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చాడ‌ని అంటున్నారు. ఆయ‌న‌కి న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇప్పిస్తుండ‌డంతో పాటు వ‌ర్మ మేన‌రిజాన్ని అనుక‌రించేలా ట్రైనింగ్ ఇస్తున్నార‌ట‌. అయితే, ఇందులో నిజమెంత అనే విషయాన్ని జొన్నవిత్తులే స్వయంగా వెల్లడించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments