Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ కాపోడో.. కమ్మోడో కాదు... రాజు.. అందుకే ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు : వర్మ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ దఫా ప్రభాస్ కులంపై ట్వీట్ చేశారు. ఇది పెను దుమారాన్నే లేపేలా ఉంది. ప్రభాస్ కాపోడో.. కమ్మోడో కాదు.. రాజ వంశం. అందుకే ఇంత పెద్ద స్ట

Webdunia
బుధవారం, 3 మే 2017 (08:57 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ దఫా ప్రభాస్ కులంపై ట్వీట్ చేశారు. ఇది పెను దుమారాన్నే లేపేలా ఉంది. ప్రభాస్ కాపోడో.. కమ్మోడో కాదు.. రాజ వంశం. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాడు అంటూ కితాబిచ్చాడు. ప్రభాస్ హీరోగా నటించిన "బాహుబలి 2" చిత్రం విడుదలైనప్పటి నుంచి రాంగోపాల్ వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. నిజంగా ఈ చిత్రం అంతగా నచ్చి చేస్తున్నాడో.. లేదా ట్వీట్లు చేయాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్నాడో తెలియదు కానీ.. వరుస ట్వీట్లు చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. "ఇత‌ర హీరోలు కాపులు, క‌మ్మ‌లపై శ్ర‌ద్ధ చూపిన‌ట్టు.. ప్ర‌భాస్ త‌న కుల‌మైన‌ రాజులపైనే ఫోక‌స్ పెట్టుంటే ఇంత క్రేజ్ వ‌చ్చేది కాదు. ప్ర‌భాస్ అలా ఆలోచించ‌లేదు. అందువ‌ల్లే అత‌ను ఇంట‌ర్నేష‌నల్ స్టార్ అయ్యాడు. ప్ర‌భాస్ ఇక నుంచి లోక‌ల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాల్సిన ప‌ని లేద‌ని, ఎందుకంటే అత‌నికి నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్యాన్స్ ఉన్నార‌ు. అంతేకాదు, లోక‌ల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించే స్టార్స్ ఎప్పుడూ లోక‌ల్ స్టార్స్‌గానే మిగిలిపోతార‌"ని వ‌ర్మ ట్వీట్ చేశాడు. వర్మ తాజాగా చేసిన ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments