Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 రోజుల్లో 700 కోట్లకు చేరువలో బాహుబలి: రాజమౌళి టీమ్‌కు ట్రేడ్ ఎనలిస్టుల నీరాజనం

భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వచ్చిన రూ. 792 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును తుడిచిపెట్టేయడానికి బాహుబలి-2 సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల కలెక్షన్లకు చేరువలోకి వచ్చినట్లు సినీవర్గాల టాక్. ఓపెనింగ

Webdunia
బుధవారం, 3 మే 2017 (08:51 IST)
బాహుబలి 2 కలెక్షన్ల హవా మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం నుంచి ఉదయం ఆటలకు ఆక్యుపెన్సీ కాస్త తగ్గినా సాయంత్రం ఆటలకు మాత్రం మళ్లీ బాగా పుంజుకోవడంతో కలెక్షన్ల వరద సాగుతూనే ఉంది. అయినప్పటికీ మంగళవారం కూడా 65 శాతం ఆక్యుపన్సీ సాధించడం హిందీ చిత్రసీమకు సంబంధించినంతవరకు అసాధారణమని ట్రేడ్ ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద చెప్పాలంటే ఉత్తర భారత్‌లో బాహుబలి ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. హిందీ ప్రాంతంలో బాహుబలి ఇంత టెర్రిఫిక్ విజయం సాధించడానిని నోటి మాటల ద్వారా ప్రచారం ముఖ్య కారణం. సెలవులు ముగిసినప్పటికీ మామూలు రోజైన మంగళవారం కూడా థియేటర్లు కిటకిటలాడుతున్నాయంటే ఈ చిత్రం ఏ స్థాయిలోకి వెళుతుందో ఊహించడానికి కూడా కష్టమని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. 
 
ఇక దక్షిణాదికి వస్తే కలెక్షన్లు సాధారణ స్థాయికి వస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం ప్రాంతాలను కలిపి చూసినా సరే హిందీ బాహుబలి 2 ఆధిక్యత సాధించింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్త కలెక్షన్ల రూ.600 కోట్లను దాటింది. ఇక మంగళవారం తాజా డేటాను చూస్తే 700 కోట్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. అంటే అయిదు రోజుల్లో 700 కోట్ల రూపాయలు. అమీర్ ఖాన్ ఆల్ టైప్ రికార్డు అయిన పీకే చిత్రం కలెక్షన్లు రన్‌టైమ్ మొత్తంలో 780 కోట్లు కాగా బాహుబలి 2 ఈ రికార్డును కేవలం వారం రోజుల్లోనే బీట్ చేయబోతూండటం బాలీవుడ్ ప్రముఖులను నిర్ఘాంత పరుస్తోంది. 
 
హిందీ ప్రాంతంలో మంగళవారం 65 శాతం ఆక్యుపెన్సీతో బాహుబలి 2 హిందీ వెర్షన్ 25 కోట్లు సాధించి ఔరా అనిపించింది. అదేసమయంలో దక్షిణాదిలో కూడా ఆక్యుపెన్సీ కాస్త తగ్గినా బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి.

భారతదేశ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వచ్చిన రూ. 792 కోట్లే అత్యధిక వసూళ్లు. ఈ రికార్డును తుడిచిపెట్టేయడానికి బాహుబలి-2 సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల కలెక్షన్లకు చేరువలోకి వచ్చినట్లు సినీవర్గాల టాక్. ఓపెనింగ్ వీకెండ్‌లోనే దాదాపు 540 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలికి.. సోమవారం మేడే కావడం, చాలామందికి సెలవు కావడం బాగా కలిసొచ్చింది. అమెరికా బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. అక్కడ ప్రస్తుతం విన్ డీజిల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్8 మొదటి స్థానంలోను, ఒక లాటిన్ సినిమా రెండో స్థానంలోను ఉండగా మూడోస్థానంలో బాహుబలి నిలిచింది.
 
ఒక దక్షిణ భారత పరిశ్రమకు చెందిన సినిమా హిందీలో విడుదలై... అక్కడ తొలి నాలుగు రోజుల్లో రికార్డు సృష్టించడం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఒక్క హిందీలోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్టు తరణ్ ఆదర్శ్‌ తెలిపారు. సోమవారం నాటి కలెక్షన్లతో ఈ సినిమా అన్ని రికార్డులనూ నాకౌట్ బిజినెస్‌తో బుల్డోజ్ చేసిందని, ఇప్పటికి ఇంకా ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, మొత్తం వివరాలు మళ్లీ చెబుతానని అన్నారు. అప్పటికే కేవలం హిందీ వెర్షన్‌లోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్లు సాధించిన విషయాన్ని ఆయన ప్రకటించారు. 
 
అదే సమయంలో రాజమౌళి, బాహుబలి టీమ్ కలిసి భారతీయ సినిమా గర్వంగా నిలిచేలా చేశారంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అలాగే, ఒక్క అమెరికాలోనే ఓపెనింగ్ వీకెండ్‌లో ఒక భారతీయ సినిమా రూ. 65.65 కోట్లు సాధించగలదని ఎవరైనా కనీసం ఊహించగలరా అంటూ.. యూఎస్ రికార్డుల గురించి కూడా వెల్లడించారు.
 
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా భారతదేశంలో 6500 స్క్రీన్లతో పాటు ప్రపంచవ్యాప్త్ంగా 9వేల స్క్రీన్లలో విడుదలైంది. దాదాపు మరో వారం రోజుల వరకు కూడా చాలావరకు థియేటర్లలో టికెట్లన్నీ అప్పుడే అమ్ముడైపోయాయి. సినిమాకు అంతగా వసూళ్లు వస్తాయా అని చాలామంది వ్యక్తం చేసిన అనుమానాలను ఈ వసూళ్లు పటాపంచలు చేశాయి.
 
 taran adarsh ✔ @taran_adarsh
#Baahubali2 is the new yardstick...
Crossed ₹ 50 cr Day 2
Crossed ₹ 100 cr Day 3
Crossed ₹ 150 cr Day 4
 
 
taran adarsh ✔ @taran_adarsh
Indeed, you and Team #Baahubali have made Indian cinema proud... Thank you, @ssrajamouli ji httpstwitter.comssrajamoulistatus859082168810618880 …
 
 taran adarsh ✔ @taran_adarsh
#Baahubali2 - USA Thu + Fri $ 4,562,936, Sat $ 3,403,900, Sun $ 2,245,100. Total $ 10,211,936 [₹ 65.65 cr]. PHENOMENAL! @Rentrak
 
 taran adarsh ✔ @taran_adarsh
Did you ever imagine an Indian film would collect ₹ 65.65 cr in its opening weekend in USA alone #Baahubali2 has achieved the feat...
 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments