Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాను ఇడియట్ అన్న బాలీవుడ్ రోగ్ క్రిటిక్.. రానా ప్రతి సవాల్

బాహుబలి 2 దెబ్బకు బాలీవుడ్ బాద్షాల రికార్డులు చెరిగిపోతున్న నేపథ్యంలో బాహుబలి 2 నటులపై వ్యక్తిగత విమర్శలకు బాలీవుడ్ దిగుతోంది. బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Webdunia
బుధవారం, 3 మే 2017 (04:41 IST)
బాహుబలి 2 దెబ్బకు బాలీవుడ్ బాద్షాల రికార్డులు చెరిగిపోతున్న నేపథ్యంలో బాహుబలి 2 నటులపై వ్యక్తిగత విమర్శలకు బాలీవుడ్ దిగుతోంది. బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఓ కమాల్ ఆర్ ఖాన్ మరో అడుగు ముందుకేసి బాహుబలి 2 యూనిట్ సభ్యులపై విమర్శలకు దిగాడు.
 
రానా ట్విట్టర్ పేజ్ స్క్రీన్ షాట్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్. 'నేను ఈ ఇడియట్‌ని ఎప్పుడు ఫాలో అవలేదు. ఈ రోజు వరకు అతని గురించి ట్వీట్ కూడా చేయలేదు. అయినా తను మెదడు లేని వాడిగా ప్రూవ్ చేసుకునేందుకు నన్ను బ్లాక్ చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ ట్వీట్‌పై జాతీయ మీడియాలో వార్తలు రావడంతో రానా స్పందించాడు. 'ఆ మొరటు వ్యక్తిని ఏడాది కిందటే బ్లాక్ చేశాను' అంటూ రిప్లై ఇచ్చాడు రానా. మరి రానా స్పందనపై కేఆర్ కే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
 
బాలీవుడ్‌లో చిన్న సినిమాల విషయంలో కూడా స్పందించే కొంత మంది స్టార్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 2 సినిమాపట్ల స్పందించకపోవటంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. 
 
 KRK ✔ @kamaalrkhan
I never followed this idiot neither tweeted about him till date. Still he blocked me to prove that he is brainless.
 
Rana Daggubati ✔ @RanaDaggubati
Blocked that bloke almost a year ago!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments