Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్మ

Webdunia
శనివారం, 28 మే 2022 (17:40 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వార్తల్లో నిలిచారు. నట్టి క్రాంతి, కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు వర్మ. మా ఇష్టం సినిమా సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వర్మ పేర్కొన్నారు. 
 
2020 నవంబర్ 30న తన లెటెర్ హెడ్ తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించారని.. అందులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి వున్నట్లు సృష్టించారన్నారు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఏప్రిల్‌లో డేంజరస్ సినిమా విడుదల కావాల్సిందని.. నకిలీ పత్రాలతో దావా వేసి సినిమా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు వివరించారు. 
 
మరోవైపు ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments