క్యాస్టింగ్ కౌచ్' 'మీటూ' ఉద్యమాలు సినిపరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది హీరోయిన్లు అవకాశాల కోసం పడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ. సంకీర్తన - కీచురాళ్లు - కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గీతాకృష్ణ.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లే.. హనీ ట్రాప్ కూడా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటని ప్రశ్నించగా.. ''ఏమీ తేడా లేదు. ఇండస్ట్రీలో అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. అమ్మాయిలను మోసం చేసేవాళ్లు ఇప్పుడూ ఎప్పుడూ వున్నారు'' అని బోల్డ్‌గా మాట్లాడారు గీతాకృష్ణ.
''నువ్వు కమిట్మెంట్ ఇచ్చి వచ్చావ్ అని అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుందా? ఎవరూ ఒప్పుకోరు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది.. ఉండబోతోంది.. రాబోయే రోజుల్లో ఇంకా బాగా పెరుగుతుంది'' అని అన్నారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అనేది కోలీవుడ్‌లో పుట్టింది.
నాస్టీ ఫెలోస్ వాళ్ళు. కన్నడ వాళ్ళు ఇంకా డర్టీ ఫెలోస్'' అని దర్శకుడు గీతాకృష్ణ అన్నారు. ''ఒక ఆడదాన్ని చూశారంటే 90 శాతం మగవాళ్ళు అలానే ఆలోచిస్తారు. ఆడది కూడా హనీ ట్రాప్. వీళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది.. ఎలా వాడిని లొంగదీసుకుందాం.. ఎలా డబ్బులు గుంజుదాం అని ఆలోచిస్తుంటారు. దాన్నే హనీ ట్రాప్ అంటారు. వాళ్ళు కాస్టింగ్ కౌచ్ చేస్తే.. వీళ్ళు హనీ ట్రాప్ చేస్తారు. ఈ రెండూ ఎప్పుడూ ఉంటాయి'' అని గీతా కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
''దర్శకుల్లోనే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది సంగీత దర్శకుల్లో కూడా ఉంది. అందమైన సింగర్స్ తమతో పడుకోవాలని సంగీత దర్శకులు కోరుకుంటారు'' అని తెలిపారు. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే... అయితే 'నేను అందరినీ అనడం లేదు. అలాంటివి తన లైఫ్‌లో వద్దు అనుకునే హీరో హీరోయిన్లు కూడా ఉంటారు. వాళ్ళు 10-15 శాతం ఉంటారు. అందుకే అందరినీ ఓకేలాగా చూడలేం. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటే మాత్రం గతంలోనూ ఉంది.. ఇప్పుడు ఉంది.. భవిష్యత్ లో కూడా ఉంటుంది అని చెప్తాను'' అని సీనియర్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెబుతూ.. రేణూ దేశాయ్ చాలా పర్ఫెక్ట్ గర్ల్ అని గీతాకృష్ణ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ''ప్రభుదేవా హీరోగా చేసిన 'టైమ్' సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ చేసాం. దానికి 20 మంది అమ్మాయిలను ఫోటోలు తీసాం. అయితే నేను రేణూ దేశాయ్ ఫోటోని ఎంపిక చేసాను. 'ఆ అమ్మాయి ఎందుకు? మీరు చెప్పిన మాట వినదు' అని కో-ఆర్డినేటర్స్ చెప్పారు. అలా ఎందుకు అన్నారో నాకు అసలు అర్థం కాలేదు. ఫోటో వెనకున్న నెంబర్‌తో రేణూ దేశాయ్‌కి ఫోన్ చేస్తే హోటల్‌కు వచ్చి కలిసింది. 'ఏంటి ఇక్కడ నీ గురించి ఇలా అంటున్నారు.. నీకేమైనా యాటిట్యూడ్ ప్రాబ్లమా? అని అడిగాను.
'అదేం లేదండీ.. ఇక్కడ వీరంతా ఇలానే ఉంటారు. డర్టీ ఫెలోస్. నేను కమిట్మెంట్స్‌కు దూరంగా ఉంటాను కాబట్టి.. నన్ను సపోర్ట్ చేయరు అని చెప్పింది. వెంటనే నువ్వే నా మూవీలో హీరోయిన్ అన్నాను. చివరకు సిమ్రాన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా ఆరోజు రేణూ దేశాయ్ చెప్తే కానీ నాకు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియలేదు. ఇది 1999లో జరిగిన విషయం'' అని గీతా కృష్ణ తెలిపారు.