Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ 2 అరగంట తర్వాత బోర్ కొట్టేసింది.. ది కశ్మీర్ ఫైల్స్ అదిరింది.. వర్మ (వీడియో)

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (18:39 IST)
కేజీఎఫ్ 2 సినిమాతో పాటు కాశ్మీరీ ఫైల్స్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  స్పందించారు. 'కేజీఎఫ్ 2' చిత్రం బాలీవుడ్ లో చాలా మందికి నచ్చలేదని వర్మ అన్నారు. సినిమాను చూసిన ఓ బాలీవుడ్ బడా దర్శకుడు తనకు ఫోన్ చేశాడని... అరగంట సినిమా చూసే సరికి బోర్ కొట్టిందని చెప్పాడని తెలిపారు. అయితే వాళ్లకు తాను చెప్పేది ఒకటేనని... సినిమా నచ్చినా, నచ్చకపోయినా... అది సాధించిన ఘన విజయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. 
 
వాస్తవికతకు దూరంగా ఒక అసహజమైన రీతిలో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడని తెలిపారు. రాఖీ బాయ్ మెషిన్ గన్ తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయని... ఇది తనకు చాలా విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పలేనని... అయితే కొన్ని సీన్లను మాత్రం నోరెళ్లబెట్టుకుని చూశానని అన్నారు. 
 
ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'ది కశ్మీర్ ఫైల్స్' ఒకటని వర్మ చెప్పారు. బాలీవుడ్ సైతం పట్టించుకోని ఒక దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments