Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' తర్వాత 'రంగస్థల'మే...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:06 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పైగా, ఈ చిత్రం రూ.2000 కోట్ల కలెక్షన్లను అధికమించింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఓ బుక్ రూపంలో రూపుదిద్దుకుంటోంది. ఇపుడు 'నాన్ బాహుబ‌లి' మూవీగా ప‌లు రికార్డులు సృష్టించిన "రంగ‌స్థ‌లం" చిత్రం త్వ‌ర‌లో ఓ బుక్ రూపంలో రాబోతుంద‌ని తాజా స‌మాచారం.
 
రాంచ‌ర‌ణ్, స‌మంత, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా విడుద‌లైన ఈ చిత్రం రూ.200 కోట్ల భారీ వ‌సూళ్ళ‌ని సాధించి ఇంకా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌లో రాంచ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత క‌నిపించి అల‌రించారు. నాన్ బాహుబ‌లి మూవీగా ప‌లు రికార్డులు సృష్టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రం త్వ‌ర‌లో ఓ బుక్ రూపంలో రాబోతుంద‌ని తాజా స‌మాచారం. 
 
ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ ఇందులోని పాత్ర‌ల‌కి సంబంధించి ఓ బుక్ త‌యారు చేయాల‌ని భావించాడ‌ట‌. ఇందుకు సంబంధించి స‌న్నాహ‌ల‌లో ఉన్నాడ‌ని టాక్‌. బాహుబ‌లి సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ 'రంగ‌స్థ‌లం' సినిమాకి సంబంధించి బుక్ రూపొందించ‌డం గొప్ప విశేష‌మే అని చెప్ప‌వ‌చ్చు. 'రంగ‌స్థ‌లం' చిత్రం కోసం సుకుమార్ ఓ విలేజ్ సెట్ క్రియేట్ చేయ‌గా, ఇప్ప‌టికి ఇదీ చూప‌రుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments