శ్రీమంతుడిని వెనక్కి నెట్టిన ''రంగస్థలం'': సీక్వెల్‌లో చిట్టిబాబుకు సౌండ్ వినిపిస్తుందట..

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా గతవారం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అమెరికాలో నాన్ బాహుబలి రికార్డుల

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (09:22 IST)
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా గతవారం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అమెరికాలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది. ఇప్పటివరకూ బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తరువాత మూడో స్థానంలో మహేష్ బాబు ''శ్రీమంతుడు'' ఉండగా, ''రంగస్థలం'' దాన్ని కిందకు నెట్టేసింది. 
 
''శ్రీమంతుడు'' చిత్రం 2.89 మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేయగా, ''రంగస్థలం'' తొలి పది రోజుల వ్యవధిలోనే 3 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఈ సినిమా మరింత కలెక్షన్లను సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా 4 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన రంగస్థలం సినిమా గతవారమే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్‌పై సుకుమార్ మాట్లాడుతూ ''ప్రేక్షకులకు ఇంత దగ్గరైన చిట్టి బాబు పాత్రను ఇంతటితో వదిలేయాలనుకోవడం లేదు. ఈ పాత్రను కొనసాగించే ఆలోచన చేస్తున్నానని..ఈ సారి చేస్తే చిట్టి బాబుకు చెవిటి ఆపరేషన్ చేయించి సరికొత్త కథ కథనాలతో ఉంటుందని తెలిపాడు. అలాగే సరికొత్త మేకోవర్‌లో, మాటలు వినగలిగే వాడిగా మారుస్తానని సుకుమార్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments