Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుమ్మురేపుతున్న రంగస్థలం.. ఆనందంలో మెగా ఫ్యాన్స్ (Video)

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 'రంగస్థలం' సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ ఈ సినిమా దూసుకుపోతుండటంతో మెగా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

Advertiesment
దుమ్మురేపుతున్న రంగస్థలం.. ఆనందంలో మెగా ఫ్యాన్స్ (Video)
, గురువారం, 5 ఏప్రియల్ 2018 (12:50 IST)
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 'రంగస్థలం' సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ ఈ సినిమా దూసుకుపోతుండటంతో మెగా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సుకుమార్.. చరణ్‌లను ప్రశంసిస్తున్నారు.
 
ఇప్పటికే పవన్ కల్యాణ్.. ఎన్టీఆర్.. రానా తదితరులు ఈ సినిమా టీమ్‌ను అభినందించారు. తాజాగా ఈ జాబితాలో వెంకటేశ్ కూడా చేరిపోయారు. "రంగస్థలం" చూశాను..  'చిట్టిబాబు'గా చరణ్ నటన మచ్చలేని విధంగా వుంది. ప్రతి పాత్రను సుకుమార్ చాలా అద్భుతంగా మలిచాడు. ఆయన దర్శక ప్రతిభకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపించారు. 
 
అలాగే, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా చెర్రీని ఆకాశానికెత్తేశాడు. చెర్రీ నటనకు చిరంజీవి సైతం గర్వపడుతాడంటూ వ్యాఖ్యానించారు. సుకుమార్.. చరణ్.. సమంత ఈ ముగ్గురూ తమ కెరియర్లోనే ఇంతటి వేగవంతమైన సక్సెస్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇకపోతే, ఈ 'రంగస్థలం' చిత్రం నెగెటివ్ టాక్‌ను అధికమించి దూసుకుపోతోంది. సాధార‌ణంగా ఓ పెద్ద హీరో సినిమా విడుద‌లైతే ముందుగా యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతుంటారు. సినిమా బాగుంద‌ని టాక్ వ‌చ్చినా కూడా నెగిటివ్ ప్ర‌చారం చేస్తుంటారు. అయితే 'రంగ‌స్థ‌లం' సినిమాకు మాత్రం మిన‌హాయింపు ల‌భించింది. 
 
సినిమా చూసిన ఇత‌ర పెద్ద హీరోలు ఎలా స్పందిస్తున్నారో.. వారి అభిమానులు కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నారు. అంద‌రూ 'రంగ‌స్థ‌లం' సినిమాను, చెర్రీ న‌ట‌నను మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రేక్ష‌కులంద‌రి ఆద‌రాభిమానాల‌తో చిట్టిబాబు దూసుకుపోతున్నాడు. ఓవ‌ర్సీస్‌తోపాటు బెంగ‌ళూరు, చెన్నై వంటి న‌గ‌రాల్లో కూడా ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది.
 
మరోవైపు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం 'రంగ‌స్థ‌లం' విజ‌యాన్ని ఆస్వాదిస్తున్నాడు. 'రంగ‌స్థ‌లం' సినిమాకు, అందులో చెర్రీ న‌ట‌న‌కు సామాన్యుల నుంచే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుంచి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్న సంగతి తెలిసిందే. మోహ‌న్‌బాబు, వెంక‌టేష్‌, ఎన్టీయార్ వంటి టాప్ హీరోలు చెర్రీ న‌ట‌న‌ను ప్ర‌శించారు.
 
చిట్టిబాబు పాత్ర కోసం చెర్రీ చాలా క‌ష్ట‌ప‌డిన సంగతి తెలిసిందే. దాదాపు సంవ‌త్స‌రం పాటు గ‌డ్డం లుక్‌తోనే క‌నిపించాడు. సినిమా పూర్తైపోవ‌డంతో త‌ను సాధార‌ణ లుక్‌లోకి వ‌చ్చేశాడు. తాజాగా త‌న భార్య ఉపాస‌న‌తో తీయించుకున్న ఓ ఫోటోను చెర్రీ త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. 'హ‌మ్మ‌య్య‌.. ట్రిమ్మింగ్‌, క‌టింగ్ చేయించుకున్న త‌ర్వాత ఐదు కేజీల బ‌రువు త‌గ్గినట్టుంది' అంటూ చెర్రీ కామెంట్ చేశాడు. 
 
ఇదిలావుంటే రంగస్థలం చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా దుమ్మురేపుతుంది. రోజులు గడుస్తున్నా థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. అలాంటి ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో మాత్రం ఈ చిత్రాన్ని ఇప్పటివరకు చూడలేదు. చరణ్‌తో ఎంతో చనువుగా వుండే బన్నీ మాత్రం ఇంతవరకూ ఈ సినిమా చూడలేదు.. స్పందించలేదు. దాంతో ఈ విషయంపై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే, దీనికి కారణం లేకపోలేదు.
 
ప్రస్తుతం బన్నీ ఒక వైపున 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాను చూడాలనే భావించాను. అయితే ఈ సినిమాను తమ హోమ్ థియేటర్లో కాకుండా.. అంతా కలిసి థియేటర్‌కి వెళ్లి జనం మధ్యలో చూద్దామని బన్నీతో అమ్మ'నిర్మల కోరిందట. తల్లి కోరిక మేరకు.. అలాగే చేద్దామని బన్నీ చెప్పాడట. త్వరలోనే ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే బన్నీ ఈ సినిమాను చూడబోతున్నాడన్న మాట. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ, సమంత కిస్ సీన్ 45 నిమిషాల్లోనే తీసేశాం.. పదిలక్షలు బెట్ కట్టారు?