Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి కూడా గర్వపడుతుంటాడు... 'రంగస్థలం'పై మోహన్ బాబు

రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆంధ్రా నుంచి అమెరికా వరకు సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాపై పలువురు సినీప్రముఖులు ఇప్పటికే తమ తమ అభిప్రాయాలను తెలుపుతుండగా కలెక్షన్ కింగ్

Advertiesment
చిరంజీవి కూడా గర్వపడుతుంటాడు... 'రంగస్థలం'పై మోహన్ బాబు
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (22:01 IST)
రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆంధ్రా నుంచి అమెరికా వరకు సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాపై పలువురు సినీప్రముఖులు ఇప్పటికే తమ తమ అభిప్రాయాలను తెలుపుతుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు. 
 
రంగస్థల సినిమాకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడం ఎంతో సంతోషంగా ఉందని హీరో మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్‌తో పాటు అందరికీ అభినందనలు తెలిపారు. ఏ తండ్రికైనా పిల్లల విజయం కంటే సంతోషం మరొకటి ఉండదని, తన స్నేహితుడు చిరంజీవి కూడా రామ్ చరణ్ విషయంలో గర్వపడుతుంటాడని ఆశిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు. 
 
రంగస్థలం సినిమాను త్వరలోనే చూస్తాను. చిట్టిబాబుకు, ఈ సినిమాలోని యూనిట్ సభ్యులందరికీ కంగ్రాట్స్ అని చెప్పారు మోహన్ బాబు. చిరంజీవి కుమారుడు నటించిన సినిమాపై మోహన్ బాబు ప్రసంశల వర్షం కురిపించడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. రామ్ చరణ్‌ కెరీర్‌లోనే రంగస్థలం సినిమా హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. విడుదలైన రోజు నుంచి కంప్లీట్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది రంగస్థలం మూవీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం స్త్రీ అని గుర్తుపెట్టుకోండి.. కాజల్ అగర్వాల్