Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" టెక్నీషియన్లకు "బంగారు కానుకలు"

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (07:23 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్‌లు మల్టీస్టార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం గత నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలై కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తుంది. దీంతో చిత్ర బృందం సక్సెస్‌ మత్తులో తేలిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పని చేసిన చీఫ్ టెక్నీషియన్లను హీరో రాంచరణ్ బంగారు కానుకలకు ఇచ్చారు. వారితో బ్రేక్ ఫాస్ట్ చేసిన చెర్రీ... వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఒక్కొక్కరికి తులం బంగారం, స్వీట్లు కానుకగా అందజేశారు. తద్వారా తన కృతజ్ఞతను తెలియజేశారు. ట్రిపుల్ ఆర్ చిత్ర విజయానికి వివిధ భాగాల నిపుణుల అందించిన సేవలను ఈ సందర్భంగా రాంచరణ్ ప్రస్తావించి అభినందించారు. 
 
కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రం తొలి రోజే ఏకంగా రూ.223 కోట్లను, తొలి మూడు రోజుల్లో రూ.500+ కోట్లను, తొలివారంలో రూ.750 కోట్లు చొప్పున కలెక్షన్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఈ చిత్రం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments