Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ కోసం.. గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు అభిమాని పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (19:24 IST)
ఇటీవల తన అభిమాన నటుడు సోనూసూద్‌ను కలవడం కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేసిన ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

తమ అభిమాన హీరో రామ్ చరణ్‌ను కలిసేందుకు తెలంగాణలో గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు రామ్ చరణ్ వీరాభిమానులు హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏకంగా 240 కిలోమీటర్ల దూరం ఉండటం గమనార్హం. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే ముగ్గురు జూన్ 20వ తేదీన రామ్ చరణ్ ని కలిసి ఉద్దేశంతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర ప్రారంభించారు. 
 
జూన్ 24వ తేదీకి హైదరాబాద్ చేరుకున్న వీరు రామ్ చరణ్ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నారు. అయితే వీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన విషయాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రామ్ చరణ్ దృష్టికి తీసుకువెళ్లగా రామ్ చరణ్ వారి అభిమానానికి పొంగిపోయాడు. 
Ramcharan


వారిని ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి పిలవడమే గొప్ప అని అభిమానులు భావిస్తున్న తరుణంలో అలా పిలవడమే కాక వారికి హగ్ కూడా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా ముగ్గురితో రామ్ చరణ్ ఒక గంట పాటు గడిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments