Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూర్ అహ్మద్ కుటుంబానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పది లక్షల విరాళం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (21:44 IST)
గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణ వార్తకు ‘మెగా’ కుటుంబం వెంటనే స్పందించింది. విషయం తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో నిన్న వెళ్ళలేకపోయారు. 
 
రామ్‌చరణ్‌ ఒక ప్రకట చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్‌ అహ్మద్‌ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ‘నూర్‌ అహ్మద్‌ గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. 
 
గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అన్నారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ అహ్మద్‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని సంతాపాన్ని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments