Webdunia - Bharat's app for daily news and videos

Install App

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

దేవీ
గురువారం, 22 మే 2025 (15:23 IST)
Ram Charan, Bujji Babu, Divyandu Sharma
హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక తారాగణంతో భారీ ఫైట్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించ నున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ ఓ ఫొటోను షేర్ చేశారు. సెట్లో ఓ మార్కెట్ దగ్గర సత్తిబాబు కిళ్లీకొట్టు ముందుర దర్శకుడు బుజ్జిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ తో కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను బయటకు ఈరోజు విడుదల చేశారు.
 
Ram Charan, Bujji Babu, Divyandu Sharma
ఇప్పటికే శివరాజ్ కుమార్, జగపతిబాబుతో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఓ జాతర నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ పార్ట్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. క్రీడా నేపథ్యంలో ఈ చిత్ర కథ వుంటుంది. అందులో క్రికెట్ కూడా ఓ భాగం. పొడవాటి జుట్టు, గెడ్డంతో అప్పటి కాాలానికి సంబంధించిన గెటప్ లో రామ్ చరణ్ వున్నారు. దివ్యేంద్రు కూడా ఇంచుమించు అదే గెటప్ లో వున్నాడు.
 
ఈ సినిమాను  7 మార్చి, 2026 న విడుదలచేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జాన్వీకపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్. రెహ్మాన్, రత్నవేలు, కొల్లా, నవీన్ నూలి సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments