నటి సమంత నిర్మాతగా మారింది. మే 9న విడుదలైన శుభం చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి, సెలెబ్రీటీల నుంచి మద్దతు వస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా శుభం సినిమాకు రామ్ చరణ్ మద్దతు ప్రకటించారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంతను అభినందించారు. ఇంకా ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. 
 
									
										
								
																	
	 
	"నేను శుభం గురించి కుటుంబాల నుండి గొప్ప విషయాలు వింటున్నాను. ట్రైలర్ చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
 
									
											
							                     
							
							
			        							
								
																	మనమందరం ఇలాంటి నవల, స్ఫూర్తిదాయకమైన చిత్రాలను సపోర్ట్ చేయాలి. సమంతకు నా శుభాకాంక్షలు. నిర్మాతగా అందరికీ ఇంత ఆశాజనకమైన ప్రారంభం లభించదు. మొత్తం బృందానికి అభినందనలు." అని చరణ్ వెల్లడించారు. దీనిపై సమంత హర్షం వ్యక్తం చేసింది.