Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

దేవీ
గురువారం, 4 సెప్టెంబరు 2025 (17:43 IST)
Ram potineni - Puppy Shame song
రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా లో సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వివేక్ & మెర్విన్ సంగీతం అందించిన ఫన్నీ నంబర్ పప్పీ షేమ్.. ఆగస్టు 8న విడుదల కానుంది. పోస్టర్‌లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపించారు. భారీగా జనం వున్న థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్నట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది.
 
ఆంధ్రా కింగ్ తాలూకా లో రామ్‌ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు, ఇది ఒక అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, ఉపేంద్ర సూపర్ స్టార్‌ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
 
మహేష్ బాబు పి దర్శకత్వంలో  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. రామ్ పోతినేని స్వయంగా రాసిన, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడిన ఫస్ట్ సింగిల్  వైరల్ అయ్యింది. ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
 
ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments