Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు నేనే పోటీ... ప్రేక్షకులకు బోర్ కొడుతుంది... రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (10:26 IST)
ఒకపుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇపుడు ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అందుకే బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే, ఇటీవల ఆమె నటించిన చెక్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 
 
''చెక్‌ ఏ తరహా చిత్రమనేది నేను ఆలోచించలేదు. నాకు స్క్రిప్ట్‌ నచ్చింది. మేం ఓ ప్రయత్నం చేశాం. నేనెప్పుడూ ఆలోచించేది ఒక్కటే. నాతోనే నాకు పోటీ. అంటే నా లాస్ట్‌ సినిమాకి, ప్రజెంట్‌ సినిమాకి కంపేర్‌ చేస్తే.. నా పర్ఫార్మెన్స్‌ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది అదే. అది చెక్‌లో చాలా ఇంప్రూల్‌ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశా. అందులో వైష్ణవ్‌ తేజ్‌ హీరో. 
 
మేమిద్దం గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. డిఫరెంట్‌ రోల్‌ కాబట్టి ఎగ్జైట్‌ అయ్యా. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నా. అందులో నాలుగు కమర్షియల్‌ సినిమాలే. ఇంకొకటి డిఫరెంట్‌ సినిమా. ఏ సినిమాలను అయితే ఐదేళ్ల క్రితం కమర్షియల్‌ కాదని అన్నారో... ఇప్పుడు అవే కమర్షియల్‌ సినిమాలు అయ్యాయి. 
 
ఐదేళ్ల క్రితం ఒక సెక్షన్‌/సెగ్మెంట్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ కోసం తీసే సినిమాలు అని వేటిని అనుకున్నావో... ఇప్పుడు ఆ సినిమాలను అందరూ చూస్తున్నారు. ప్రేక్షకులు హాలీవుడ్‌ సినిమాలు, ఓటీటీల్లో మంచి కంటెంట్‌ చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్‌ సినిమాలు రిపీట్‌ చేస్తే... ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది అని వ్యాఖ్యానిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments