Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురచ దుస్తుల్లో రకుల్ ప్రీత్... నెటిజన్ల ట్రోలింగ్...

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (11:31 IST)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. పొట్టి దుస్తులు ధరించిన రకుల్.. మరో మహిళ గురించి కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు రకుల్‌ను సోషల్ మీడియా వేదికగా కబడ్డీ ఆడుకుంటున్నారు. 
 
ఇటీవల ముంబైకు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా కురచ దుస్తులు ధరించి, కారు దిగుతూ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటలోలకు ఓ యువకుడు కామెంట్ పెట్టాడు. వీటిపై రకుల్ ప్రీత్ స్పందించింది. ఆ యువకుడిని చీవాట్లు పెడుతూనే అతని తల్లిని కూడా ఈ వివాదంలోకి లాగింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'నీపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. 'అసలు నువ్వు ఎలాంటి దుస్తులు ధరించావో తెలుసా' అని మరొకరు, 'నీవాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు' అంటూ ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా సాగుతోంది రకుల్ ప్రీత్‌పై నెటిజన్ల ట్రోలింగ్. 
 
రకుల్ కామెంట్‌ను అతి కొద్దిమంది మాత్రమే సమర్ధిస్తుండగా, పలువురు విమర్శిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్‌ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. 'నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి కుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా' అంటూ కౌంటరిచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments