రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని పెళ్లి.. ఫోటోలు వైరల్.. మెనూ ఎలా?

సెల్వి
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (12:49 IST)
Rakul preet singh
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని వివాహం జరగనుంది. సెలబ్రిటీ జంట ఇటీవల గోవాకు బయలుదేరినట్లు కనిపించింది. 
 
వివాహ వేదిక నుండి కొన్ని చిత్రాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు రౌండ్లు చేస్తున్నాయి. ఒక చిత్రంలో, ''భగ్నాని- సింగ్ కుటుంబం మీకు స్వాగతం పలుకుతున్నారు'' అని రాసి ఉన్న సైన్ బోర్డు పూలతో అలంకరించబడి ఉంటుంది. మరో చిత్రంలో కొబ్బరికాయపై ఆర్జే అనే అక్షరాలు ముద్రించబడ్డాయి.
 
గోవాలో జరిగే రకుల్-జాకీల వివాహ వేడుకలో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు వివాహ వేడుకకు హాజరుకానున్నారు.
 
రకుల్ జంట భారతీయ, అంతర్జాతీయ ఫుడ్ మెనూని రూపొందించడానికి ఒక ప్రత్యేక చెఫ్‌ని నియమించుకున్నారు. పెళ్లిలో ఫిట్‌నెస్ కాన్షస్ ఉన్న అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను కూడా ఏర్పాటు చేశారు. తమ పెళ్లికి వచ్చే అతిథుల ఆరోగ్యంపై కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు రకుల్ జంట.
 
మెనూలో ఎక్కువగా గ్లూటెన్ రహితంగా, చక్కెర రహితంగా ఉంటుందని టాక్. రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా ఫిట్‌నెస్‌తో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో అదానీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి.. రూ.60కోట్లు పెట్టుబడి

మస్కట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి.. కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు

పవన్ కళ్యాణ్ తిరుమల భక్తులను అలా కాపాడారు: జనసేన పొలిటికల్ మిస్సైల్

కిడ్నీ మార్పిడి- ఆపరేషన్ సమయంలో స్పృహ కోల్పోయి మహిళ మృతి

రూ.3 కోట్ల విలువైన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు.. హైదరాబాదులో అలా పట్టుకున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments