Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (09:20 IST)
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాపై మరో బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని స్పృహ లేకుండా పడిపోయే తనూశ్రీ ఇపుడు పెద్దపెద్ద కబుర్లు చెబుతోందంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో రాఖీ సావంత్‌పై తనూశ్రీ దత్తా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసింది.
 
'మీటూ' ఉద్యమంలో భాగంగా నటుడు నానా పాటేకర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉదంతంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనుశ్రీకి మద్దతు పలికారు. కానీ, నటి రాఖీ సావంత్ బాధితురాలు తనుశ్రీపై పలు ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా, తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను నానా పాటేకర్ సలహా మేరకు ఒక సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంట్రావర్సీ క్వీన్ రాఖీపై తనుశ్రీ రూ.10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు. 
 
ఈ ఉదంతం గురించి రాఖీ గతంలో మీడియాతో మాట్లాడుతూ 'ఆరోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుంది. ఈ రోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు బాగోతం బయపెట్టాలనుకుంటున్నాను. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం