Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ గదిలో పెళ్లి చేసుకున్నా... హనీమూన్ తర్వాత వెళ్లిపోయాడు...

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (16:40 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాఖీ సావంత్ తన పెళ్లి వార్తలపై స్పందించింది. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వచ్చిన వార్తలను నిర్ధారించింది. గతంలో అబద్ధం చెప్పానని, ఆ విషయంలో తనను క్షమించాలని కోరింది. పైగా, తన వివాహం ఓ ప్రైవేట్‌గా జరిగిందని చెప్పింది. ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారని చెప్పుకొచ్చింది.
 
ఆమె తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ, తన పెళ్లి ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్లో జరిగిందని చెప్పింది. పైగా, తాను ఓ క్రిస్టియన్ అని, తన భర్త హిందువు అని తెలిపింది. అందుకే మా పెళ్లి రెండు సంప్రదాయాల మేరకు జరిగినట్టు చెప్పింది. 
 
అంతకుముందు రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనూ మా వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిపింది. అయితే, భద్రతా కారణాల రీత్యా వెడ్డింగ్ హాల్లో కాకుండా.. ఓ ప్రైవేట్ గది తీసుకొని అక్కడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది వివరించింది. మా పెళ్లికి తన కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు తప్ప ఇంకెవరూ హాజరు కాలేదనీ, తన భర్త చాలా ప్రైవేట్ పర్సన్ అని, మీడియా కంట పడడం తనకు నచ్చదని, అందుకే మా పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని తెలిపింది. 
 
అదేసమయంలో తమ పెళ్లి గురించి మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని తెలిపింది. నా భర్త ఓ ఎన్నారై. తన పేరు రితేష్. యూకేలో ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ కంపెనీలో పనిచేస్తాడు. హనీమూన్ తర్వాత తను నేరుగా యూకే వెళ్లిపోయాడు. నా వీసా పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక నేను కూడా అక్కడికే వెళ్లిపోతాను. అయితే పెళ్లి చేసుకున్నా కదా అని.. నా పని ఆపేయను. నాకు సినిమా ఆఫర్లు వస్తే.. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నటించి తిరిగి వెళ్తాను అని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments