అక్టోబరు 10న రజినీకాంత్ 'వేట్టైయాన్'

వరుణ్
సోమవారం, 3 జూన్ 2024 (16:51 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం వైట్టైయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకుడు. ఈ చిత్రం గురించిన కీలక విషయాన్ని హీరో రజినీకాంత్ వెల్లడించారు. ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న తలైవర్.. తన కొత్త చిత్రం వేట్టైయన్ రిలీజ్ తేదీని వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాలకు వెళ్లిన ఆయన అక్కడ సాధువులతో సమయం గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ అప్‌కమింగ్‌ సినిమాలు 'కూలీ', 'వేట్టయాన్‌'లకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
 
'వేట్టయాన్‌' దసరా కానుకగా అక్టోబరు 10వ తేదీన విడుదల కానుంది. నా పాత్ర షూటింగ్‌ పూర్తయింది. ఇతర నటీనటులకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్నా. దాని షూటింగ్‌ జూన్‌ 10 నుంచి ప్రారంభించనున్నారు' అని తెలిపారు. 
 
తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడుతూ.. 'ప్రతి ఏడాది ఇలా యాత్ర చేయడం వల్ల కొత్త అనుభూతి పొందుతాను. అందరికీ ఇలాంటి ప్రయాణం అవసరం. దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది. దైవంపై నమ్మకం పెరుగుతుంది' అన్నారు.
 
మరోవైపు, రజినీకాంత్‌ ఈ అప్‌డేట్‌ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్‌ మీడియాలో 'దేవర' వర్సెస్‌ 'వేట్టయాన్‌' చర్చ మొదలైంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్‌ కానుంది. దీంతో ఆ తేదీన బాక్సాఫీస్‌ వద్ద పోరు ఖాయమంటున్నారు సినీ ప్రియులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

మెక్సికో సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి.. అసలేం జరిగింది?

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments