Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2.0 టీజర్ వేడుకకు మమ్ముట్టి, మెగాస్టార్, మోహన్ లాల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను ఆగస్టు 15 తర్వాత విడుదల చేయనున్నారు. స్టార్ హీరోలు రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను పొందుపరిచారు. ఈ పను

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (13:38 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను ఆగస్టు 15 తర్వాత విడుదల చేయనున్నారు. స్టార్ హీరోలు రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను పొందుపరిచారు. ఈ పనులు ఇంకా పూర్తికాకపోవడంతోనే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో మొత్తం 11వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంకర్ 2.0 సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ పనులు పూర్తయ్యాక విడుదలపై కచ్చితమైన తేదీని ప్రకటిస్తారు. ఇక ఆడియో వేడుక కార్యక్రమాన్ని దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ సినీ యూనిట్.. త్వరలోనే హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్‌తో భారీగా అంచనాలు పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. 
 
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, అలాగే మలయాళ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మాసాంతంలో రజనీకాంత్ రోబో 2 టీజర్ వేడుకకు భాగ్యనగరం వేదిక కానుందని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments