Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెల్ రీల్ అవార్డుకు శంకర్ "2.O" నామినేట్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:36 IST)
మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం "2.O''. ఈ విజువల్ వండర్ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తే పక్షిరాజు పాత్రలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించాడు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. 
 
ఈ చిత్రంలోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని అందించాయి. విమ‌ర్శ‌కులు సైతం ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తారు. అయితే ఈ చిత్రం తాజాగా గోల్డెన్ రీల్ అవార్డుకి నామినేట్ అయింది. ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్ర‌ధానోత్సవ వేడుకలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ అధిక శాతం ఓటింగ్ పొందిన చిత్రానికి ఈ అవార్డ్ అందించ‌నున్నారు. 
 
ప్రతి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే ఈ వేడుక‌ని ఈ సారి కూడా అంతే బ్రహ్మాండంగా జ‌ర‌పాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. 3డీ ఫార్మెట్‌లో 4డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సౌండ్‌సిస్టంలో రూపొందిన "2.O" చిత్రం త‌ప్ప‌క గోల్డెన్ రీల్ అవార్డు అందుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. విదేశీ చిత్రాల క్యాట‌గిరీలో ఉత్తమ సౌండ్‌ ఎఫెక్ట్‌ విభాగంలో "2.O" చిత్రం గోల్డెన్‌ రీల్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఉత్తమ సౌండ్‌ ఎఫెక్ట్, ఎడిటింగ్‌ కళాకారులకు గోల్డెన్ రీల్ అవార్డులను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments