Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ అల్లుడు పాస్‌పోర్టు మిస్సింగ్...

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:07 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో అల్లుడు పాస్‌పోర్టుతో పాటు.. ఇతర క్రెడిట్, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులను పోగొట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి రజినీకాంత్ చిన్న కుమార్తె సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెల్సిందే.
 
ప్ర‌ముఖ బిజినెస్‌మెన్ విశాగ‌ణ్‌తో సౌంద‌ర్య ఏడ‌డుగులు వేయ‌గా, వారి వివాహానికి ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత చెట్టాప‌ట్టాలు వేస్తున్న ఈ జంట రీసెంట్‌గా చెన్నై నుండి లండ‌న్ వెళ్ళేందుకు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లోని హెర్బ్యూ ఎయిర్ పోర్ట్‌కి చేరుకోగా, ఇమ్మిగ్రేష‌న్ స‌మ‌యంలో విశాగ‌ణ్ త‌న పాస్ పోర్ట్‌తో పాటు అమెరిక‌న్ డాల‌ర్స్‌తో కూడిన సూట్‌కేసు మిస్ అయినట్టు తెలుసుకున్నాడు. 
 
ఆపై ఆయన వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే భారత రాయబార కార్యాలయం కూడా వెంట‌నే స్పందించి విశాగన్ కోసం డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేసిన‌ట్టు స‌మాచారం. సౌంద‌ర్య‌, విశాగ‌ణ్‌ల‌కి ఇదివ‌రికే వివాహం కాగా, వారిరివురు ఇటీవ‌ల రెండో పెళ్లి చేసుకున్నారు. 
 
కాగా, సౌంద‌ర్య 2010లో వ్యాపార‌వేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను సౌంద‌ర్య పెళ్లి చేసుకున్న‌ది. ఆ త‌ర్వాత వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. సౌంద‌ర్య‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొచ్చియాడ‌న్‌, వీఐపీ 2 చిత్రాల‌కు ఆమె డైర‌క్ట‌ర్‌గా ప‌ని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments