Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ 'కబాలి'కి తప్పని పైరసీ గండం... 180 పైరసీ లింకుల్లో లీక్...

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలికి పైరసీ గండం తప్పలేదు. ఇప్పటికే అనేక గండాలు తప్పించుకుని ఈనెల 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పైరసీభూతం పట్టినట్టు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు.

Webdunia
గురువారం, 14 జులై 2016 (11:54 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలికి పైరసీ గండం తప్పలేదు. ఇప్పటికే అనేక గండాలు తప్పించుకుని ఈనెల 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పైరసీభూతం పట్టినట్టు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 180కి పైగా పైరసీ లింకులను గుర్తించామని, వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నందున వెంటనే ఆయా సైట్లలోంచి తమ సినిమా లింకులను తొలగించాల్సిందిగా కోరారు. 
 
మొబైల్ డౌన్‌లోడ్స్ జోరందుకోక ముందే తమని ఈ గండం నుండి గట్టెంక్కించాల్సిందిగా ఆయన కోర్టుని వేడుకున్నారు. దాదాపు 110 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందించామని, ఆ నిధులు రాబట్టుకోవాలంటే పైరసీని అరికట్టాలని ఆయన కోరారు 
 
కాగా, ఇటీవల పైరసీ బారిన పడ్డ ‘ఉడ్తా పంజాబ్’, ‘సుల్తాన్’ వంటి సినిమాలు పడిన విషయం తెల్సిందే. దీంతో సినిమా పరిశ్రమకి పైరసీ సమస్య నిత్య గ్రహణంలా మారిందని చిత్ర ప్రముఖులు వాపోతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments