Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదిగా దూరంగా ఉంటున్నాం.. విడాకులు కావాలి : సౌందర్య రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను దూరంగా ఉంటున్నామని అందులో ఆమె పేర్కొన్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్‌తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి యేడాది బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్ని రోజుల తర్వాత సౌందర్య పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. 
 
అందువల్ల భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, కొచ్చడియాన్ గ్రాఫిక్ చిత్రానికి ఈమె దర్శకురాలిగా కూడా పని చేశారు. పైగా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఈమె సొంతం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments